బాల్యమిత్రుడు మన్నెంకొండ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం.

బాల్యమిత్రుడు మన్నెంకొండ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం.

పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన మన్నెంకొండ అనే వ్యక్తి అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది.2006–2007 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రుడు ఇకలేకపోవడం అతని స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది.ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించిన చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి మానవత్వాన్ని చాటుకున్నారు. వారు తమ వంతుగా రూ. 42,000/-ఆర్థిక సహాయాన్ని సమీకరించి, మృతుడి భార్య మరియు పిల్లలకు అందజేశారు.స్నేహితులు మాట్లాడుతూ.. మన స్నేహితుడు ఇక మన మధ్య లేకపోయినా, అతని జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అతని కుటుంబానికి ఈ కష్టకాలంలో తోడుగా నిలవడం మన బాధ్యతగా భావించాం అని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్థులు స్నేహితుల ఈ సేవా భావాన్ని అభినందిస్తూ.. స్నేహబంధం గొప్పతనాన్ని కొనియాడారు.మన్నెంకొండ ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబానికి ధైర్యం కలగాలని అందరూ ప్రార్థించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .