మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా హుజురాబాద్‌లో బీజేపీ నిరసన
Views: 6
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 18 ( తెలంగాణ ముచ్చట్లు):
మహిళలకు అధికారం దూరం చేసే విధంగా పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఆరోపిస్తూ హుజురాబాద్ పట్టణ, మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ వైఖరిని ఖండించారు.
ఈ నిరసనలో బీజేపీ పట్టణ, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments