డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.

డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.

-దేశంలోనే ఏకైక విజినరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు
 
-డాక్టర్ పులిపాటి ప్రసాద్ 
 
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు )
 
ఖమ్మం పౌరసమితి అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్  ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  76వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పులిపాటి ప్రసాద్ రాష్ట్ర తెలుగు యువత  విద్యార్థులు కేకు కట్ చేసి నారా చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేశంలోనే ఏకైక విజనరీ  లీడర్ నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. దార్శనికత ఐటీ రంగ విస్తరణ ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన  సమర్థవంతమైన పరిపాలనకు ప్రసిద్ధి చంద్రబాబుకే సాధ్యం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీ స్థాపనతో హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో నిలిపి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 2026 నాటికి 22 నెలల్లోనే రూ. 9.36 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, అమరావతిని అభివృద్ధి చేస్తున్న విజనరీ నేతగా నిలిచారని అన్నారు. 1990లలోనే ఐటీ రంగాన్ని గుర్తించి హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మార్చారు.హైటెక్ పరిపాలన ఇ-గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకమైన వేగవంతమైన పరిపాలన అందించారని తెలిపారు. ఈ కార్యక్రమం నందు ఖమ్మం జిల్లాకు చెందిన యువతరం నటులు నటించిన కడదాక నీవెంటే చిత్రం రష్యానందు జరిగిన స్పేస్ ఫెస్టివల్ నందు బెస్ట్ ఫీచర్ ఫిల్ముగా ఎంపికైన సందర్భంగా చిత్ర బృందాన్ని డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలు హాస్పిటల్ నందు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు.  అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఖమ్మం రైల్వే స్టేషన్ నందు గల వృద్ధులకు వస్త్ర దానం  నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం పౌర సమితి అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ తెలుగు యువత రాష్ట్ర నాయకులు నాగళ్ళ శ్రీనివాస్ చౌదరి కడదాక నీ వెంటే చిత్రబృందం హీరో దర్శకుడు కిషోర్ ఇనుపనూరి అనిల్ మద్దెల భోగరాజు శోభన్ బాబు పులిపాటి ప్రసాద్ విద్యాసంస్థల అధ్యాపక బృందం ప్రతాప్ శ్వేత శ్రీనివాస్ నీరజ అక్ష అఖిల్ సాయిశ్రీ శిరీష సునీత మౌనిక మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అందించిన సహకారం మరువలేనిది : పులిపాటి ప్రసాద్
 
 టిఎన్ఎస్ యూ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేళ్లు చంద్రబాబు నాయుడు దగ్గర పని చేశానని  రాజకీయంగా నాకు ఆవకాశం కల్పించిన ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు  లకు ఎంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా డాక్టర్ పులి ప్రసాద్ తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .