హెచ్ఎంటి నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే బండారి  కృషి

హెచ్ఎంటి నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే బండారి  కృషి

_నూతన వెల్ఫేర్ కమిటీ మర్యాదపూర్వక భేటీ 

– శాలువాలతో పరస్పర సత్కారం, అభివృద్ధి పనులకు కృతజ్ఞతలు

నాచారం, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులందరికీ శాలువాలతో సత్కారం చేసి అభినందించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, హెచ్ఎంటి నగర్ చెరువు సుందరీకరణకు రూ.30 కోట్లతో ప్రత్యేక చొరవ తీసుకోవడం, అలాగే ప్రాంతంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.1.10 కోట్లు మంజూరు చేయించడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంత అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బి. బుచ్చయ్య, ఉపాధ్యక్షుడు ఆర్. యాదగిరి రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. రామ కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి కె. శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి. సమ్రాట్, ఖజాంచి జి. రామరావు, కార్యవర్గ సభ్యులు వి. బాల్ రెడ్డి, పి. నరసింహ రెడ్డి, బి.హెచ్. నారాయణ బాబు, ఎండీ యూసుఫ్, సతీష్ కులకర్ణి మరియు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం. జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం.
_పనికి వెళ్లి వచ్చిన తర్వాత బయటకు వెళ్లి కనిపించని ప్రశాంత్…  _మిస్సింగ్ కేసు నమోదు జవహార్ నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు) మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా జవహార్...
కమిషన్ల కోసమే గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్.
బాలాజీ నగర్ లో ఆటో డ్రైవర్ అదృశ్యం
వనపర్తి ఎమ్మెల్యే చేతుల మీదగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
మోజర్లలో చలివేంద్రం ప్రారంభం.
ఈసీ నగర్‌లో సెల్ టవర్ వివాదం ఉద్రిక్తతకు దారి
జవహార్ నగర్ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్