కమిషన్ల కోసమే గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్.

బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపణ .

కమిషన్ల కోసమే గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్.

పెద్దమందడి,ఏప్రిల్7(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ, గోపాల్పేట్ మండలం  గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేని ప్రాంతాల్లో కమిషన్ల కోసం మాత్రమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు.గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం కూడా అదే కోణంలో జరుగుతోందని ఆరోపించారు.ఈ రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనలకు దిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో, రైతుల దీక్షకు మద్దతుగా ఈ నెల 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారని తెలిపారు.ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతుబంధు అద్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు వేణు యాదవ్, మనగిళ్ల  సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,నాగేంద్రం యాదవ్, కుమార్ యాదవ్, అల్వాల వెంకటరెడ్డి, కురుమూర్తి, రఘువర్ధన్ రెడ్డి, బలిదు పల్లి అంజి, శ్రీను, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .