వెల్టూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

వెల్టూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

పెద్దమందడి,ఏప్రిల్5(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం  నాయకులు మాట్లాడుతూ.. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.అలాగే, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తూ యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారా దేశం మరింత ప్రగతి సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి, సీనియర్ నాయకులు డిఎస్ మహేష్, మల్లికార్జున్, గుండెల ఆంజనేయులు, వడ్డ శేఖర్, ప్రేమ్ సాగర్, మద్దూరు వెంకటయ్య, మద్దూరు నరసింహ, నాగభూషణ్, దయ్యాల రమేష్, బుసయ్య, మిల్లర్ రాజు, ఆంజనేయులు, యాదయ్య, రాజశేఖర్, రుక్మద్దీన్, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .