హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు

హల్లెలూయ గీతాలతో నగరం మార్మోగింది

హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 05 (తెలంగాణ ముచ్చట్లు):

హుజరాబాద్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రెవరెండ్ ఈసంపల్లి జాన్ బాబు పాస్టర్ ఆధ్వర్యంలో జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు శుక్రవారం సిలువ వేయబడి, మూడవ దినమైన ఆదివారం సమాధి నుండి లేచి పునరుత్థానుడైన సందర్భంగా విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు నిర్వహించారు. బైబిల్ సందేశాల ప్రకారం యేసు ప్రభువు మానవాళి రక్షణ కోసం పాప విమోచనార్థం పునరుత్థానం చెందినారని పాస్టర్ సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా తెల్లవారుజామున 5 గంటలకు అంబేద్కర్ కూడలి వద్ద భక్తులు “హల్లెలూయ” నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఉమెన్స్ చైర్మన్ విజయమ్మతో పాటు చర్చికి చెందిన కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కీర్తనలు, ప్రార్థనలు, బైబిల్ వాక్యాలతో యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అనేక మంది విశ్వాసులు పాల్గొని, యేసుక్రీస్తు ప్రభువు సిలువను జయించి సమాధి నుండి లేచిన గొప్ప సందేశాన్ని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు

Tags:

Post Your Comments

Comments

Latest News

హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 05 (తెలంగాణ ముచ్చట్లు): హుజరాబాద్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రెవరెండ్ ఈసంపల్లి జాన్...
సామాజిక న్యాయానికి శాశ్వత దీప్తి బాబు జగ్జీవన్ రామ్ – హుజురాబాద్‌లో ఘన నివాళులు
ఈసీఐఎల్ చౌరస్తాలో భ్రమరాంబ ఫుడ్ కోర్ట్ ప్రారంభం
యాదవ సంఘం కమ్యూనిటీ హాల్‌కు రూ.22 లక్షలు నిధులు మంజూరు
డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కాప్రాలో రూ.20 లక్షలతో ఓపెన్ జిమ్, చిన్నారుల పార్కు ప్రారంభం
నాగార్జున నగర్‌లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఏర్పాటు