ఈసీఐఎల్ చౌరస్తాలో భ్రమరాంబ ఫుడ్ కోర్ట్ ప్రారంభం

ఈసీఐఎల్ చౌరస్తాలో భ్రమరాంబ ఫుడ్ కోర్ట్ ప్రారంభం

_యువత వ్యాపారాల్లో ముందుండాలి 

– నాణ్యతా సేవలపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టి

కుషాయిగూడ, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లోని ఈసీఐఎల్ చౌరస్తాలో భ్రమరాంబ ఫుడ్ కోర్ట్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందుండాలని, ముఖ్యంగా వ్యాపార రంగంలో నాణ్యతా ప్రమాణాలను పాటించడం ఎంతో ముఖ్యమని సూచించారు.ఫుడ్ కోర్ట్ వంటి వ్యాపార కేంద్రాలు వినియోగదారులకు పరిశుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారం అందించాలని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం ద్వారా వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు సాయి దంపతులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాసం మైపాల్ రెడ్డి, కుమారస్వామి, పాండాల శివకుమార్ గౌడ్, రహీం, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకులు రేగళ్ల సతీష్ రెడ్డి, పోలూరి నాగార్జున, పిల్లి సాయిరాం, మల్లికార్జునరావు, కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.IMG-20260405-WA0169

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .