బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు

బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు

 నాచారం, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ హెచ్ఎం టీ నగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ సామాజిక సంక్షేమం ఆధ్వర్యంలో డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షులు ఎం. సంజన్న, ప్రధాన కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ మరియు డా. బి.ఆర్. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, మెడల మల్లికార్జున్ గౌడ్, కె. రామ్ బాబు, డా. రమేష్, వెంకటేశ్వర్ రెడ్డి, మేకల ముత్యం రెడ్డి, అషు, మహేష్ యాదవ్, మురళి, మారయ్య, రాజు బాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 05 (తెలంగాణ ముచ్చట్లు): హుజరాబాద్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రెవరెండ్ ఈసంపల్లి జాన్...
సామాజిక న్యాయానికి శాశ్వత దీప్తి బాబు జగ్జీవన్ రామ్ – హుజురాబాద్‌లో ఘన నివాళులు
ఈసీఐఎల్ చౌరస్తాలో భ్రమరాంబ ఫుడ్ కోర్ట్ ప్రారంభం
యాదవ సంఘం కమ్యూనిటీ హాల్‌కు రూ.22 లక్షలు నిధులు మంజూరు
డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కాప్రాలో రూ.20 లక్షలతో ఓపెన్ జిమ్, చిన్నారుల పార్కు ప్రారంభం
నాగార్జున నగర్‌లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఏర్పాటు