నాగార్జున నగర్‌లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఏర్పాటు

నాగార్జున నగర్‌లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఏర్పాటు

_ఏప్రిల్ 26న శుభోదయ కాలనీలో సమ్మేళనం 

– 15కి పైగా కాలనీల ప్రతినిధులతో కార్యవర్గం ఎంపిక

కుషాయిగూడ, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడ డివిజన్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీలో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి కార్యవర్గాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు హిందూ ఐక్యతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, నాగార్జున నగర్ కాలనీతో పాటు 15కి పైగా కాలనీలు కలిసి ఈ నెల 26న శుభోదయ కాలనీలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం నేపథ్యంలో ఈ సమితి ఏర్పాటైంది.ఈ సమితిలో అన్ని కాలనీల నుంచి ప్రతినిధులకు స్థానం కల్పించారు. సమితి అధ్యక్షుడిగా మదిర వెంకట రాంబాబు, ఉపాధ్యక్షులుగా కంచుగంట్ల మల్లేశ్, భాస్కర్ పటేల్, కృష్ణ ప్రసాద్, కార్యదర్శిగా భట్టిప్రోలు సూర్యప్రకాష్, సహ కార్యదర్శులుగా శంకర్ రెడ్డి, తూతిక శివ, అరుణ్, కేశవ్, కె. యశ్వంత్ సాగర్, కోశాధికారిగా జయకృష్ణ ఎన్నికయ్యారు. సభ్యులుగా కృష్ణ యాదవ్, బలగం మల్లేశ్, కుమారి, కనకయ్య ముదిరాజ్, నల్లోల కనకయ్య, సురేశ్ గుప్తా, రాజన్న, శ్రీనివాస్, భాస్కర చారి, బాలకృష్ణ చారి, నరసింహా రెడ్డి తదితరులు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా వాసవీ శివా నగర్‌లోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన సమావేశంలో పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షుడు మదిర వెంకట రాంబాబు మాట్లాడుతూ, రాబోయే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కాలనీ నుంచి అధిక సంఖ్యలో హిందూ కుటుంబాలు పాల్గొనేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.ధర్మంపై అవగాహన పెంపొందించడానికి ఈ సమ్మేళనం తొలి అడుగుగా నిలుస్తుందని, పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. అనంతరం ఇతర సమితి సభ్యులు కూడా తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .