శాంతి విల్లే కాలనీలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

శాంతి విల్లే కాలనీలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

కాప్రా, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గంకాప్రా సర్కిల్ డివిజన్ పరిధిలోని శాంతి విల్లే కాలనీలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల అభివృద్ధి తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం ద్వారా రవాణా సమస్యలు తగ్గి, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. శాంతి విల్లే కాలనీలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బైరీ నవీన్ గౌడ్, కాలనీ వాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .