మల్లాపూర్‌లో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

మల్లాపూర్‌లో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

మల్లాపూర్ , ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డా. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, అరుంధతి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏడేళ్ల గణేష్, లక్ష్మీపతి, వెంకట్ ప్రసాద్, వినయ్ తదితరులు, కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 05 (తెలంగాణ ముచ్చట్లు): హుజరాబాద్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రెవరెండ్ ఈసంపల్లి జాన్...
సామాజిక న్యాయానికి శాశ్వత దీప్తి బాబు జగ్జీవన్ రామ్ – హుజురాబాద్‌లో ఘన నివాళులు
ఈసీఐఎల్ చౌరస్తాలో భ్రమరాంబ ఫుడ్ కోర్ట్ ప్రారంభం
యాదవ సంఘం కమ్యూనిటీ హాల్‌కు రూ.22 లక్షలు నిధులు మంజూరు
డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కాప్రాలో రూ.20 లక్షలతో ఓపెన్ జిమ్, చిన్నారుల పార్కు ప్రారంభం
నాగార్జున నగర్‌లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఏర్పాటు