ఏ ఎస్ రావు నగర్‌లో “డబ్ల్యూ 3” ఆరోగ్య కేంద్రం ప్రారంభం

ఏ ఎస్ రావు నగర్‌లో “డబ్ల్యూ 3” ఆరోగ్య కేంద్రం ప్రారంభం

_ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం 

– ప్రజలకు ఆధునిక వైద్య సేవలు

ఏ ఎస్ రావు నగర్, ఏప్రిల్ 4 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా సర్కిల్ డా. ఏ ఎస్ రావు నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “డబ్ల్యూ 3 – విచిత్రమైన ఆరోగ్య విభాగం” గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో పాటు వెల్‌నెస్ సేవలను సమగ్రంగా అందించే ఇలాంటి కేంద్రాలు సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, ప్రభుదాస్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు.ఈ నూతన కేంద్రం ప్రారంభంతో ప్రాంతీయ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువయ్యాయి.IMG-20260404-WA0109

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .