మల్లాపూర్ లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం స్థల పరిశీలన

మల్లాపూర్ లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం స్థల పరిశీలన

 _ఎలిఫెంట్ సర్కిల్ వద్ద స్థలం అనుకూలమని అధికారుల అభిప్రాయం

మల్లాపూర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరైన నేపథ్యంలో, ఆసుపత్రి నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచనల మేరకు మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద సర్వే నంబర్ 84లో ఖాళీగా ఉన్న స్థలాన్ని పరిశీలించారు.స్థల పరిశీలనలో ఉప్పల్ మండల తహసిల్దార్ ఫూల్ సింగ్, మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. పరిశీలన అనంతరం ఈ స్థలం ఆసుపత్రి నిర్మాణానికి అనుకూలంగా ఉండటంతో పాటు అవసరాలకు సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో జలమండలి డీజీఎం వేణుగోపాల్, మేనేజర్ రోహిత్, రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులు తండా వాసుగౌడ్, తిగుళ్ల శ్రీనివాస్ గౌడ్, ఫైళ్ల ప్రవీణ్, అల్లాడి కృష్ణ యాదవ్, పద్మరెడ్డి, ఉస్మాన్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం. జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం.
_పనికి వెళ్లి వచ్చిన తర్వాత బయటకు వెళ్లి కనిపించని ప్రశాంత్…  _మిస్సింగ్ కేసు నమోదు జవహార్ నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు) మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా జవహార్...
కమిషన్ల కోసమే గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్.
బాలాజీ నగర్ లో ఆటో డ్రైవర్ అదృశ్యం
వనపర్తి ఎమ్మెల్యే చేతుల మీదగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
మోజర్లలో చలివేంద్రం ప్రారంభం.
ఈసీ నగర్‌లో సెల్ టవర్ వివాదం ఉద్రిక్తతకు దారి
జవహార్ నగర్ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్