ప్రజలకు అందించిన నిర్విరామ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు...

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజలకు అందించిన నిర్విరామ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు...

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ -06(తెలంగాణ ముచ్చట్లు)

ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించి, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు.

మార్చి నెలలో పదవీ విరమణ పొందిన (8) మంది ఉద్యోగుల కోసం సోమవారం ప్రజావాణి అనంతరం ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి.శ్రీనివాస రెడ్డి లతో కలిసి పాల్గొని ఉద్యోగుల సేవలను కొనియాడారు.

ఖమ్మం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసిన బి. అరుణ్ కుమార్, మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసిన బి. జయదాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిపిఎంఓగా పని చేసిన ఎండి. అఫ్జల్ మియా, ఎంపిహెచ్ఈఓ గా పనిచేసిన ఎంవి. నరసింహా రావు, ట్రైబల్ శాఖ పరిధిలో హెచ్ పిగా పని చేసిన ఎస్.కే. ఆసిఫ్ మియా, హౌసింగ్ శాఖ కొణిజెర్ల ఏఈ గా పని చేసిన ఐ. ఉమేశ్వర్,  రఘునాథ పాలెం తహసిల్దార్ కార్యాలయం లో చైన్ మ్యాన్ గా పనిచేసిన డి. అమృతమ్మ, ఎస్సి సంక్షేమ శాఖ పరిధిలో ఓఎస్ గా పని చేసిన డి. ఎలిశమ్మ పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. 

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు నిర్విరామంగా అందించి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  పదవీ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు పదవి విరమణ పొందిన వారిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. IMG-20260406-WA0062

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .