భూదాన్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
రైతులకు ఇచ్చిన భూమిలో ఇండ్ల నిర్మాణాలు చేయటం సరైంది కాదు
పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు భూమి అప్పగించాలి
విలేకర్ల సమావేశంలో బోధన్ రైతుల ఆవేదన
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం వెలుగుమట్ల భూధాన్ భూమిలో భూదాన్ బోర్డు వారు 31.7 ఎకరాల భూమిని 27 మంది నిరుపేద రైతు కూలీలకు భూములు అప్పగించటం జరిగిందని, 1953 నుంచి 1960 మధ్యకాలంలో ఈ భూములను సాగు కోసం నిరుపేద రైతులకు ఆనాడు అప్పగించటం జరిగిందని బోధన్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెలుగుమట్ల భూధన్ రైతులు వారి కుటుంబ సభ్యులు బందెల వెంకన్న, బందెల కృష్ణ, రెంటపల్లి మోతరయ్య, ఎస్ కే జానీ మియా లు మాట్లాడుతూ... బోధన్ బోర్డు వారు 1953 నుంచి 1960 సంవత్సర మధ్య కాలంలో పుట్టకోట, గొల్లగూడెం, గోపాలపురం తదితర గ్రామాలకు చెందిన 27 మంది నిరుపేదలకు సర్వే నెంబర్ 147, 148, 149 సర్వే నెంబర్లలో 31.7 ఎకరాల భూమిని దానంగా సాగు కోసం ఇచ్చారని తెలిపారు. శీలం మంగయ్యకు రెండు ఎకరాలు, షేక్ సైదులు కు ఎకరం 20 కుంటలు, హాబీ కి రెండు ఎకరాలు, రెడ్డి బోయిన రంగయ్యకు రెండు ఎకరాలు, బందెల లక్ష్మయ్యకు ఎకరం, షేక్ అక్బర్ సాబ్ కు రెండు ఎకరాలు, మద్దెల లచ్చయ్యకు ఎకరం, యలీజాల పున్నయ్యకు ఎకరం, మహమ్మద్ ఖాసిం కు ఎకరం 20 గుంటలు , దోమల అచ్చయ్యకు రెండు ఎకరాలు రెంటుపల్లి సుబ్బయ్యకు రెండెకరాలు, పల్నాటి చంద్రయ్యకు రెండు ఎకరాలు ఇలా 27 మందికి భూధాన్ బోర్డు వారు పంట సాగు చేసుకునేందుకు వ్యవసాయ రైతు కూలీలకు భూములు అప్పగించటం జరిగిందని వెల్లడించారు.
గత ఏడు సంవత్సరాల క్రితం కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యానికి దిగి మా భూములలో గుడిసెలు వేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకున్న తమను తమ కుటుంబ సభ్యులను కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగి కొట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం ఆ గుడిసెలను తొలగించి గుడిసెలు కోల్పోయిన వారికి అదే స్థలంలో ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి హక్కు కలిగిన రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా మా భూములను ఎలా ఇతరులకు కేటాయిస్తారని ప్రశ్నించారు.
పహాని, పట్టాదారు పాసుపుస్తకాలు హక్కు కలిగి ఉన్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని వారు జోక్యం చేసుకొని భూములు కోల్పోయిన నిరుపేద రైతులమైన తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
ఈ విలేకరుల సమావేశంలో దోమల నాగరాజు, పర్నాటి బుచ్చి రాములు, లకావత్ నాగేశ్వరరావు, దోమల రాము, గండికోట మనీ, కుర్ర రామ సైదులు, ఎస్కే జానీ మియా తదితరులు పాల్గొన్నారు.


Comments