వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వేలేరు, ఏప్రిల్ 06 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. బండ తండా, చింతల్ తండా, కమ్మరిపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.30 లక్షల సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు.
రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు పంపిణీ చేసి, సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందజేశారు. మే 31లోగా మొదటి విడత ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.
సాగునీటి సమస్యల పరిష్కారానికి గండి రామారం లిఫ్ట్ పనులు జూన్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .