ప్రమాదకరంగా మారిన పీచర మూలమలుపు – వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
Views: 13
On
వేలేరు, ఏప్రిల్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో గ్రామపంచాయతీ దాటి ఉన్న మూలమలుపు ప్రమాదకరంగా మారింది. అధిక లోడుతో వెళ్లే తిప్పర్ల కారణంగా రోడ్డు దెబ్బతినడంతో, క్రెషర్ యాజమాన్యం అక్కడక్కడ కంకర చిప్స్ పోయడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చింది. మలుపు వద్ద వాహనాలు స్కిడ్ అవుతూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు వాహనదారులు కిందపడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మూలమలుపు వద్ద పోసిన కంకర చిప్స్ తొలగించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments