మహిళా కౌన్సిలర్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

మహిళా కౌన్సిలర్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

*అన్వర్ అసభ్య ప్రవర్తన పై చర్యలు తీసుకోవాలి* 

*సమాజం సిగ్గుపడేలా అన్వర్ ప్రవర్తన*

*దాడి పై ఫిర్యాదు చేస్తాం*
 
*మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ* 

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)

వైరా మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ ముళ్లపాటి విజయ పై దాడి చేసిన అన్వర్ ను కఠినంగా శిక్షించి మరోసారి మహిళల వైపు కన్నెత్తి చూడకుండా అసభ్య ప్రవర్తన ప్రవర్తించకుండా చర్యలు తీసుకోవాలని వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ అన్నారు .సోమవారం కౌన్సిలర్ ముళ్లపాటి విజయ ను డాక్టర్ కాపా చంద్రకళ మహిళా కౌన్సిలర్లు వేముల శ్రావణి, చింత నిప్పు సులోచన ,ఉండ్రు వరలక్ష్మి తో కలిసి మాట్లాడుతూ వార్డులో అమృత్ పథకం కింద త్రాగునీటి సరఫరా కోసం అభివృద్ధి పని లో భాగంగా పైపులై నిర్మాణం జరుగుతుంటే నిర్మాణ పనుల వద్దకు పర్యవేక్షణకు వెళ్ళిన కౌన్సిలర్ విజయ పై అసభ్యంగా ప్రవర్తించిన అన్వర్  ఓక మహిళా అని చూడకుండా అసభ్యంగా సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన తీరు అక్కడున్న ప్రజలు ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించారు, అభివృద్ధి పనులను అడ్డుకోవడమే కాకుండా మహిళపై దాడి చేసి కాలు ప్యాక్చర్ కి కారణమైన వ్యక్తిపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో  మహిళలకు పెద్దపిట చేస్తుంటే అలాంటి మహిళలను గౌరవించాల్సింది పోయి మహిళలపై దాడులకు పాల్పడుతూ అసభ్య ప్రవర్తన చేయడం సిగ్గుచేటని అన్నారు  అతనిపై 6 తమ్ముళ్లు (అంతా మగవారే)  అతనితో పాటు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు  పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .