బీజేపీ ఆవిర్భావ దినోత్సవం భారీ స్థాయిలో సంబరాలు

బిజెపి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్

బీజేపీ ఆవిర్భావ దినోత్సవం భారీ స్థాయిలో సంబరాలు

ఎల్కతుర్తి, ఏప్రిల్ 6( తెలంగాణ ముచ్చట్లు): 

ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ స్థాయిలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ సేవ, అభివృద్ధి లక్ష్యాలతో ఏర్పడిన బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం గర్వకారణమని పేర్కొన్నారు. అంత్యోదయ సిద్ధాంతంతో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు దేశ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయని, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని వివరించారు.
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి కృషి వల్లే బీజేపీ ఈ స్థాయికి చేరిందని నాయకులు కొనియాడారు. “దేశం మొదట, పార్టీ తర్వాత” అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి ఎర్రగోళ్ల శ్రీనివాస్ యాదవ్, జిల్లా కౌన్సిల్ మెంబర్, మాజీ మండల అధ్యక్షుడు చిరంజీవి, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, జనగాని కిష్టయ్య, ఆడెపు శ్రీ వర్ధన్, పల్లెపాటి మధుకర్, ఠాగూర్ శామ్ సింగ్, చదిరం రాకేష్, తక్కళ్లపల్లి సంపత్ రావు, అంబ్బీర్ శ్రీనివాస్, కోడం రమేష్, పేరిగు మధు, కొమ్మిడి నిరంజన్ రెడ్డి, సింగణబోయిన రాజు, చిర్ర శ్రీనివాస్, మాచర్ల తిరుపతి, కొలిపాక శ్రీను, మంతుర్తి సమ్మయ్య, సాతురి ప్రభాకర్, అల్లి కుమార్, చేరాల రంజిత్, హింగే దేవరావు, గొర్రె అరవీంద్, పండ్రాల రాజయ్య, పోలు బిక్షపతి, మంతుర్తి తిరుపతి, గొర్రె ప్రవీణ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు) కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ ప్రెస్ మీట్‌తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై...
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం భారీ స్థాయిలో సంబరాలు
పీపుల్స్ మార్చ్ మూడేళ్ల సభకు ఖమ్మం నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
ప్రజలకు అందించిన నిర్విరామ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు...
వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ
ప్రమాదకరంగా మారిన పీచర మూలమలుపు – వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్