జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం.

జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం.

_పనికి వెళ్లి వచ్చిన తర్వాత బయటకు వెళ్లి కనిపించని ప్రశాంత్… 

_మిస్సింగ్ కేసు నమోదు

జవహార్ నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా జవహార్ నగర్ పరిధిలో యువకుడు అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. అరుంధతి నగర్‌కు చెందిన సుజాత, రాంబాబు దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్ (24) కార్మికుడిగా పనిచేస్తున్నాడు.ఏప్రిల్ 5వ తేదీన ఉదయం పనికి వెళ్లిన ప్రశాంత్, సాయంత్రం సుమారు 6:30 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అనంతరం బయటకు వెళ్లొస్తానని చెప్పి తన బైక్‌పై వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి 10 గంటలకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌గా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.తరువాత బంధువుల ఇళ్లలో, పరిచయస్తుల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి సుజాత ఫిర్యాదు మేరకు జవహార్ నగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ప్రశాంత్ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .