బాలాజీ నగర్ లో ఆటో డ్రైవర్ అదృశ్యం

బాలాజీ నగర్ లో ఆటో డ్రైవర్ అదృశ్యం

– పోలీసుల దర్యాప్తు ప్రారంభం

_బాలాజీ నగర్ నివాసి చవాన్ జగన్ (50) ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన


జవహార్ నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ బాలాజీ నగర్‌కు చెందిన చవాన్ జగన్ (50) అనే ఆటో డ్రైవర్ మిస్సింగ్ అయిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, భార్య మరణించిన తరువాత జగన్ తన నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.ప్రతిరోజు మాదిరిగానే తేదీ 01.04.2026 నాడు ఉదయం ఆటోతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన జగన్, రాత్రి వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుమారుడు కుమార్ తన మేనత్త గీతకు సమాచారం ఇవ్వగా, ఆమె వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువులు, పరిచయస్తుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అదేవిధంగా జగన్ మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో అనుమానాలు మరింత పెరిగాయి.ఈ నేపథ్యంలో గీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు  జవహార్ నగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగన్ ఆచూకీ కోసం వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .