మోజర్లలో చలివేంద్రం ప్రారంభం.

మోజర్లలో చలివేంద్రం ప్రారంభం.

పెద్దమందడి,ఏప్రిల్7(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో క్రీ.శే కనిమెట్ట మారెన్న జానమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, పెద్దమందడి ఎస్సై జలందర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలు, ప్రయాణికులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామంలో ప్రతి ఒక్కరికీ తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, కూలీలు, పాదచారులు వేసవిలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై జలందర్ రెడ్డి మాట్లాడుతూ.. వేసవి కాలంలో దాహార్తి తీర్చేందుకు ఇటువంటి చలివేంద్రాలు ఎంతో అవసరమని అన్నారు.ప్రజలకు సేవ చేయడం సామాజిక బాధ్యత అని, గ్రామస్థులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, వార్డు సభ్యుడు రాములు, రవిశంకర్, ఆంజనేయులు, ఎస్ నరసింహ, గోకరయ్య, నర్సింహ గౌడ్, గట్టు రాజు, బాలస్వామి, ఆడెం కొండన్న, శివ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం. జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం.
_పనికి వెళ్లి వచ్చిన తర్వాత బయటకు వెళ్లి కనిపించని ప్రశాంత్…  _మిస్సింగ్ కేసు నమోదు జవహార్ నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు) మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా జవహార్...
కమిషన్ల కోసమే గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్.
బాలాజీ నగర్ లో ఆటో డ్రైవర్ అదృశ్యం
వనపర్తి ఎమ్మెల్యే చేతుల మీదగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
మోజర్లలో చలివేంద్రం ప్రారంభం.
ఈసీ నగర్‌లో సెల్ టవర్ వివాదం ఉద్రిక్తతకు దారి
జవహార్ నగర్ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్