ఏఎస్ రావు నగర్‌లో పారిశుద్ధ్య సమస్యలపై అధికారుల దృష్టి

ఏఎస్ రావు నగర్‌లో పారిశుద్ధ్య సమస్యలపై అధికారుల దృష్టి

 – టాయిలెట్ నిర్మాణానికి చర్యలు

_వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు పరిశీలన 

– సిఎస్ఆర్ నిధులతో నిర్మాణానికి ముందడుగు

ఏ ఎస్ రావు నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

ప్రజా పాలన – పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏఎస్ రావు నగర్ ప్రాంతంలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. డా .ఏఎస్ రావు నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు హుడా పార్క్ మరియు ప్రభుత్వ బస్తీ దావఖాన మధ్య ప్రాంతంలో ఎక్కువగా ఆరు బయట మలమూత్ర విసర్జన జరుగుతుండటంతో దుర్గంధం వ్యాపించి ప్రజారోగ్యానికి భంగం కలుగుతోందని గుర్తించారు.ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ (హెల్త్ & శానిటేషన్) రఘు ప్రసాద్ ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఎంపైర్ అసోసియేషన్ గుర్తించిన ప్రభుత్వ స్థలంలో టాయిలెట్ నిర్మాణం అవసరమని నిర్ధారించారు.
వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సిఎస్ఆర్ నిధులతో టాయిలెట్ నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకోవడానికి ముందుకు రావడంతో, అవసరమైన అనుమతుల కోసం హెడ్ ఆఫీస్‌కు ఫైల్ పంపించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో కాప్రా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, డీఈఈ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) రవి, డీఈ బాలకృష్ణ, శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.IMG-20260407-WA0078

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .