కాప్రా సర్కిల్‌లో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

కాప్రా సర్కిల్‌లో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

_ప్రజా పాలన ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 

_ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభం

కాప్రా ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కాప్రా సర్కిల్ కార్యాలయంలో పారిశుద్ధ్య, ఎంటమాలజీ మరియు ట్రాన్స్పోర్ట్ వర్కర్ల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నాచారం ప్రసాద్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నగర శుభ్రత కోసం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇలాంటి హెల్త్ క్యాంప్‌ల ద్వారా వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మ, మెడికల్ ఆఫీసర్ మమత, మేనేజ్మెంట్ ప్రతినిధి రవి, నాచారం డీఈఈ రవిచంద్, శాంతి, సూపర్వైజర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.ప్రసాద్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ రామన్ రావు మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొని కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సూచనలు అందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .