హనుమకొండలో రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో మేడ్చల్ అథ్లెట్ల రాణింపు

హనుమకొండలో రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో మేడ్చల్ అథ్లెట్ల రాణింపు

_కోచ్ తిరుమలరావు శిక్షణలో మెడల్స్ వర్షం 

– కోచ్‌కే రెండు రజతాలు

మేడ్చల్ మల్కాజ్గిరి, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఏప్రిల్ 11, 12 తేదీల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ కప్ అండర్-20 (బాలురు, బాలికలు) మరియు సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ క్రీడల్లో తెలంగాణ యువత రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.ఈ పోటీల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన అథ్లెట్లు విశేష ప్రతిభ కనబరిచారు. కోచ్ తిరుమలరావు శిక్షణలో ఉన్న క్రీడాకారులు పలు విభాగాల్లో మెడల్స్ సాధించి జిల్లాకు గౌరవం తీసుకొచ్చారు.మహిళల విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో పోత్రకుండ సరిత కాంస్య పతకం గెలుచుకోగా, అండర్-20 విభాగంలో గణేష్ 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో 5వ స్థానం సాధించాడు. హేమర్ త్రోలో 4వ స్థానం, వాసుదేవరాజు షాట్‌పుట్‌లో 6వ స్థానం పొందారు. మహిళల విభాగంలో రజిని 100 మీటర్ల పరుగు ఫైనల్లో 6వ స్థానం దక్కించుకుంది. పురుషుల విభాగంలో శ్రీనివాస్ 1500 మీటర్ల పరుగు పందెంలో మంచి ప్రతిభ కనబరిచాడు.
ఇక కోచ్ తిరుమలరావు స్వయంగా సీనియర్ పురుషుల విభాగంలో పాల్గొని 110 మీటర్ల హర్డిల్స్ మరియు ట్రిపుల్ జంప్ ఈవెంట్లలో రెండు రజత పతకాలు సాధించడం విశేషంగా నిలిచింది.ఈ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన అథ్లెట్లు రానున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా విజేతలను కోచ్ తిరుమలరావు అభినందిస్తూ, భవిష్యత్తులోమరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. IMG-20260412-WA0116

Tags:

Post Your Comments

Comments

Latest News