చీర్యాలలో ఉచిత మెగా వైద్య శిబిరం

చీర్యాలలో ఉచిత మెగా వైద్య శిబిరం

_96 మందికి వైద్య సేవలు

– 17 మందికి ఆపరేషన్లు అవసరం గుర్తింపు

_రాజకీయ నాయకులు, వైద్యులు, గ్రామస్తుల భాగస్వామ్యం

కీసర, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్, నవోదయ సంక్షేమ వేదిక, సిఐటియు కీసర మండల కమిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం వద్ద ఈ శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా డీసీసీ కార్యదర్శి బక్కని నర్సింగ్ రావు రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేయించడం అభినందనీయమని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో వైద్యుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు.శిబిరంలో కంటి పరీక్షలు కమలానగర్ ప్లానెట్ ఆప్టికల్స్ అనిల్ కుమార్ బృందం, దంత పరీక్షలు దమ్మైగూడ పద్మ సాయి డెంటల్ క్లినిక్ డాక్టర్ దినేష్ బృందం నిర్వహించగా, కమలానగర్ శ్రీకర హాస్పిటల్స్ వైద్యులు బీపీ, షుగర్ మరియు సాధారణ పరీక్షలు చేశారు. అదేవిధంగా డాక్టర్ కేర్ హోమియో ఏఎస్ రావ్ నగర్ బ్రాంచ్ వైద్యులు సేవలు అందించారు. నాగారం కుమారి, వెంకటేష్ వెల్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ శిబిరంలో మొత్తం 96 మందికి వైద్య సేవలు అందించగా, 17 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు.కార్యక్రమంలో కోఆర్డినేటర్లు జివి రావు, సిహెచ్ దేవి రెడ్డి, సునీల్ కుమార్, పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. అలాగే అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోడ నర్సింగరావు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ శ్రీనివాసరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోల కృష్ణ యాదవ్, బిఎస్పి నాయకుIMG-20260412-WA0115డు బోడ జంగయ్య, సిఐటియు నాయకులు బంగారు నర్సింగరావు, చింతకింది అశోక్ తదితరులు, గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News