హుజురాబాద్‌లో విషాదం… కాకతీయ కాలువలో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు

హుజురాబాద్‌లో విషాదం… కాకతీయ కాలువలో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ యువకుడు కాకతీయ కాలువలో గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా బిలోలి మండలం సగరెల్లి గ్రామానికి చెందిన విజయ్ (28)గా గుర్తించారు.
కరీంనగర్ రోడ్డులో ఉన్న కాకతీయ కాలువలో ఈతకు దిగిన విజయ్, నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో అదుపు కోల్పోయి గల్లంతయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం విజయ్ కోసం విస్తృతంగా శోధన కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .