కుషాయిగూడ డిపోలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

పూలే ఆశయాల సాధనలో ముందుండాలని నాయకుల పిలుపు

కుషాయిగూడ డిపోలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

కుషాయిగూడ, ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు)

కుషాయిగూడ డిపోలో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు డిపో అధ్యక్షులు చీర ఉపేందర్, ప్రధాన కార్యదర్శి తోడేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపో గౌరవ అధ్యక్షులు గడ్డం యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే జీవితం సమాజానికి మార్గదర్శకమని, వారి సేవలు చిరస్మరణీయమని అన్నారు. బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ పూలే ఒక గొప్ప సామాజిక విప్లవకారుడని, మహిళల విద్య, పేదల అభ్యున్నతి కోసం చేసిన కృషి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మన్నే శంకర్, రాంబాబు, డిపో అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి, కీర్తి కుమార్, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ స్వామి, వెల్ఫేర్ మెంబర్ రాములు, మహిధర్ రెడ్డి, డిపో కోశాధికారి మచ్చ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, ఇందిరా, ఉపాధ్యక్షులు అజయ్, పద్మావతి, జాయింట్ సెక్రెటరీ శ్రీశైలం, వెంకటేష్, అశోక్, ప్రచార కార్యదర్శులు రోమన్, రజిని, రాష్ట్ర నాయకులు మంగమ్మ, సృజన, రీజినల్ నాయకులు సుధా, ఉమా, త్రివేణి, పద్మావతి, భాను తదితరులు పాల్గొన్నారు.ఈ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించడంతో పాటు పూలే ఆశయాలపై అవగాహన కల్పిస్తూ విజయవంతమయ్యాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News