అక్షరమే ఆయుధం ఆకాశమే హద్దు తో యువసేన సంకల్పం
ఎల్కతుర్తి, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో యాదన్న యువసేన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి పంజాల అభిలాష్ గౌడ్‌ను గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కార్యక్రమాన్ని యాదన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్యాల లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా పెండ్యాల లోకేష్ మాట్లాడుతూ “అక్షరమే ఆయుధం – ఆకాశమే హద్దు” అనే నినాదంతో యువసేన ముందుకు సాగుతుందని తెలిపారు. గ్రామంలోని యువతను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరచడమే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
అలాగే గ్రామ అభివృద్ధికి తోడ్పడే పలు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ శిబిరాలు, విద్యా సహాయం, వైద్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించి గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా పనిచేస్తామని చెప్పారు.
గ్రామంలోని యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం యాదన్న యువసేన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంజాల యాదగిరి గౌడ్, తూముల యశ్వంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments