మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

_స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఘన నివాళులు 

– కుల నిర్మూలనకు పిలుపు

ఏ ఎస్ రావు నగర్, ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు)

సైనిక్పురి చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం నివాళి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే ఆశయాలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ పూలే సమాజంలో ఉన్న కుల వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త అని అన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలిగా తీర్చిదిద్దినట్లు, అనేక పాఠశాలలను స్థాపించి సామాజిక మార్పుకు దోహదపడ్డారని వివరించారు.
ప్రస్తుతం కూడా కుల వివక్ష కొత్త రూపాల్లో కొనసాగుతుందని, పాలకులు తమ ప్రయోజనాల కోసం కుల సమస్యలను వినియోగిస్తున్నారని విమర్శించారు. కుల నిర్మూలన కోసం సమాజం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టిపిఎస్కే, సుందరయ్య విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 14వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ, జయరాజ్, శివన్నారాయణతో పాటు రహీం, భాస్కర్, ఎం.భాస్కర్ రావు, ఎం.శ్రీనివాసరావు, ఎన్.శ్రీనివాస్, హెచ్.వి.స్వామి, జి.శివరామకృష్ణ, అశోక్, బాలు, శంకర్, శశాంక్, గద్దల నరసింహారావు, యాదయ్య, బంగారు నర్సింగరావు, వెంకటేశ్వరరావు, గణేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News