ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
_న్యూ శాంతినగర్‌లో కండువాలు కప్పి ఆహ్వానం
– ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ వైపు ప్రజల మొగ్గు
ఉప్పల్, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ డివిజన్ పరిధిలోని న్యూ శాంతినగర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పరమేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల ఫలితంగా ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యూ శాంతినగర్ కాంగ్రెస్ అధ్యక్షులు బి. లక్ష్మయ్య, జనరల్ సెక్రటరీ కె. సైదులు, ఉపాధ్యక్షులు పరశురామ్, జాయింట్ సెక్రటరీలు ప్రభాకర్, బి. శ్రీకాంత్, మాజీ అధ్యక్షులు లకన్, గంట చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు పి. మత్స్యగిరి, జి. యాదగిరి, ఉదయ్, నర్సింహా, మల్లయ్య, కృష్ణ, దర్శన్, ఉప్పలయ్య, మారయ్య, రాజు, సోమయ్య, సాయికుమార్, సత్తయ్య, బి. శివ, జనార్దన్, కిష్టయ్య, సుదర్శన్, పూరుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఏ బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవిరెడ్డి, వెంకటేష్ గుప్తా, అలుగుల అనీల్ కుమార్, జనగాం రామకృష్ణ, అల్వల భాస్కర్, నోముల సురేష్, మోహన్ నాయక్, రంగుల శేఖర్, శివ, ధనలక్ష్మి, భవాని, మమత, రాణి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments