బహుజన మహనీయుడికి ఘన నివాళులు

బహుజన మహనీయుడికి ఘన నివాళులు

ఎల్కతుర్తి, ఏప్రిల్ 11( తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాంగణంలో బహుజన మహనీయుల జయంతి వర్ధంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. కమిటీ చైర్మన్ అంబాల సుమన్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అంబాల సుమన్, మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం, విద్యా ప్రాధాన్యం, మహిళా సాధికారత కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావుడని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పూలే చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిటీ మండల ప్రధాన కార్యదర్శి బొంకూరి కార్తీక్, మేకల కిషన్, ముఖ్య సలహాదారు ఆరేపెల్లి చంద్రమౌళి, మాజీ చైర్మన్ పాక రమేష్, ఎర్ర ప్రకాష్, ధర్మ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ బొంకూరి రాజు, అంబాల నాగేష్, అంబాల మల్లేష్, మారుపాక ప్రశాంత్, మాటూరి సందీప్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .