ఎర్రకుంట స్మశాన వాటిక నూతన కమిటీకి సన్మానం

ఎర్రకుంట స్మశాన వాటిక నూతన కమిటీకి సన్మానం

_నూతన సభ్యులకు శాలువాలతో ఘన సత్కారం

_వైకుంఠధామంగా అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు

నాచారం, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు): 

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ ఎర్రకుంట హిందూ స్మశాన వాటిక నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడిగా శ్రీమూర్తి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల కార్తీక్, కోశాధికారిగా కొమ్మగాళ్ల కౌశిక్ ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ స్మశాన వాటికను ఆధునిక వైకుంఠధామంగా అభివృద్ధి చేయడానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే రూ.1 కోట్ల వ్యయంతో కాంపౌండ్ వాల్, అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. అదే విధంగా వీధి దీపాలు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఇంకా రూ.50 లక్షలతో స్నానాల గదులు మరియు ఆధునిక బర్నింగ్ ప్లాట్‌ఫారం నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బందెల మనోజ్, సందీప్, బొడ్డు శివ, విష్ణు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News