దొడగుంటపల్లిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

దొడగుంటపల్లిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

పెద్దమందడి,ఏప్రిల్11(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి వేడుకలను బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గుపాని వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ, బీసీ సంఘం నాయకుడు గుపాని వెంకటేష్ మాట్లాడుతూ మహాత్మా ఫూలేను సామాజిక ప్రజాస్వామ్యానికి మూలపురుషుడిగా కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాలకు విద్య, ఆత్మగౌరవం అందించిన మహనీయుడిగా ఆయనను గుర్తుచేశారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఫూలేకు భారతరత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గురు రాఘవేంద్రమ్మ, కొర్రపాటి రవీందర్, కొమ్ము చెన్నయ్య మాదిగ, రాజశేఖర్ శెట్టి, మాజీ ఉప సర్పంచ్ కొమ్ము చెన్నమ్మతో పాటు గ్రామ నాయకులు, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News