కాప్రాలో ఈ-వెస్ట్ క్లీన్‌నెస్ డ్రైవ్ నిర్వహణ

_రీసైక్లింగ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎన్విరోకేర్ పిలుపు

కాప్రాలో ఈ-వెస్ట్ క్లీన్‌నెస్ డ్రైవ్ నిర్వహణ

కాప్రా, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాప్రా సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఈ-వెస్ట్ క్లీన్‌నెస్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఉప్పల్ జోన్ పరిధిలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఎన్విరోకేర్ రీసైక్లింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా సంస్థ సీఈఓలు ఎస్. నరేష్ రాజ్, భరత్ వేణుగోపాల్ మాట్లాడుతూ పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలను నిర్లక్ష్యంగా పారవేయకుండా, సురక్షితంగా రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు.విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచడం ముఖ్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎన్విరోకేర్ సంస్థ మేనేజర్ సచిన్, సిబ్బంది మహమ్మద్ యాహ్య, శివ ప్రసాద్, ఎండి ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .