వేలేరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
వేలేరు ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ తాటికొండ రాజయ్య హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని రిజర్వాయర్ల హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికే దక్కుతుందని అన్నారు. అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనలు చేసి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన వారిని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.
పార్టీలో గ్రూపు రాజకీయాలు సహజమే అయినప్పటికీ, అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ పతనానికి ప్రయత్నించిన వారికి తగిన సమయంలో సమాధానం తప్పదని హెచ్చరించారు.
తనకు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో అవకాశం రాకపోయినా, పార్టీ కోసం స్టార్ క్యాంపెయినర్‌గా పని చేసి ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించేందుకు కృషి చేశానని తెలిపారు. కార్యకర్తలు ఎవరొస్తారు, ఎవరుపోతారు అని ఆందోళన చెందవద్దని, తాను ఎల్లప్పుడూ పార్టీతోనే ఉంటానని స్పష్టం చేశారు.
ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ టికెట్ తనకే వస్తుందని, కేసీఆర్ కూడా తనకు పూర్తి భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ నియోజకవర్గంలో తనతో పోటీ పడే ధైర్యం ఎవరికీ లేదని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు,మరిజె నరసింహా
రావు,కొయ్యడ మహేందర్, భూపతి రాజు, సూత్రపు సంపత్,మరియు ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


Comments