జమ్మికుంట జెపీఎల్ సీజన్-3 ముగింపు.. విజేతలకు ఘన సత్కారం

జమ్మికుంట జెపీఎల్ సీజన్-3 ముగింపు.. విజేతలకు ఘన సత్కారం

— ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి, చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు.

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జమ్మికుంట ప్రీమియం లీగ్ (JPL) సీజన్-3 క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. ఈ సందర్భంగా విజేత జట్లకు స్థానిక శాసన సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) కలిసి బహుమతులు అందజేశారు.
టోర్నమెంట్‌లో DLS జట్టు ప్రథమ బహుమతి సాధించగా, Stake 11 జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో మాట్లాడిన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని అన్నారు. గెలుపు-ఓటములు సహజమని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు.
ప్రస్తుత యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి పెట్టాలని, ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి టోర్నమెంట్లు స్థానిక ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు చింతల శ్రీనివాస్, వెంకటేష్, సత్యం తదితరులు, క్రీడాభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News