బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చూపిన మార్గం

హుజురాబాద్‌లో జయంతి వేడుకలు

బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చూపిన మార్గం

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్‌లో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి చౌరస్తాలో శనివారం జ్యోతిబాపూలే కమిటీ అధ్యక్షుడు చల్లూరి రఘు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, మహాత్మ జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలోని బలహీన వర్గాలు మరియు మహిళలకు విద్య అవసరాన్ని గుర్తించి, వారి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. ఆయన ఆలోచనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .