నూతన వధూవరులను ఆశీర్వదించిన బంజారా వెల్పేర్ నాయకులు
వరంగల్,ఏప్రిల్11(తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ జిల్లా ఉప్పర్‌పల్లి క్రాస్‌లోని కళ్యాణలక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన వివాహ మహోత్సవంలో నూతన వధూవరులు ఉదయ్ కుమార్, వంశిక అనుషలను ప్రముఖులు ఆశీర్వదించారు. ధరావత్ సుజాత రాంచందర్ నాయక్ కుమారుడు ఉదయ్ కుమార్, జాటోత్ భద్రమ్మ హమ్యా నాయక్ కుమార్తె వంశిక అనుషల వివాహ వేడుక ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ఎన్ నాయక్, సమాచార ప్రజాసంబంధాల శాఖ సంయుక్త దర్శకుడు డి ఎస్ జగన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
ఇతరంగా మాజీ జెడ్పిటిసి గుగులోత్ వీరమ్మ గోపి సింగ్, ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల అధ్యక్షుడు బాదావత్ బాలాజీ నాయక్, లంబాడీల ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లావుడియా పల్లవి రాజు నాయక్, సీనియర్ జర్నలిస్టు భూక్య శ్రవణ్ కుమార్, రెవెన్యూ విభాగం ఆర్‌ఐ పోరిక సునీల్ కుమార్, జైసింగ్ రాథోడ్, రాధా రాజు నాయక్, వీరు నాయక్, రతన్ సింగ్, తిరుపతి, యాకూబ్ నాయక్, వాలు నాయక్, రవినాథ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బంధుమిత్రులు, వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు.


Comments