సైనిక్‌పూరిలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

సైనిక్‌పూరిలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

_పూలే సేవలు చిరస్మరణీయం 

– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాప్రా, ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు)

సైనిక్‌పూరి ప్రాంతంలో మహాత్మ జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే దేశానికి అపార సేవలు అందించారని అన్నారు. సమాజంలో విద్యా విస్తరణకు ఆయన చేసిన కృషి అపూర్వమని, చదువు ద్వారానే సామాజిక, ఆర్థిక మార్పులు సాధ్యమవుతాయని తెలిపారు.బాల్య వివాహాల నిర్మూలన, వితంతు వివాహాల ప్రోత్సాహం, కుల వివక్ష నిర్మూలనలో పూలే చేసిన పోరాటం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి విద్య ఎంతో అవసరమని, సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి మహిళల కోసం పాఠశాలను స్థాపించడం గొప్ప సంస్కరణగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .