కామ్రేడ్ నూర్జహాన్‌కు సిఐటియు నివాళులు

_కార్మిక హక్కుల కోసం పోరాడిన ధీర మహిళగా ప్రశంసలు

కామ్రేడ్ నూర్జహాన్‌కు సిఐటియు నివాళులు

కీసర, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

కార్మిక ఉద్యమ ప్రముఖ నేత కామ్రేడ్ నూర్జహాన్‌కు సిఐటియు ఆధ్వర్యంలో కీసర మండలంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు, పబ్లిక్ సెక్టార్ రాష్ట్ర నాయకులు సిహెచ్ దేవి రెడ్డి నూర్జహాన్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూర్జహాన్ మరణం కార్మిక వర్గానికి తీరని లోటని అన్నారు. కార్మికులు, కర్షకులు, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీరశాలిగా ఆమెను కొనియాడారు. సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటమే మార్గమని నమ్మి, పాలకులను ధైర్యంగా ఎదిరిస్తూ ఎర్రజెండా చేతబట్టి పోరాడిన వీరవనితగా ఆమెను అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు, మండల నాయకులు చింతకింది అశోక్, వెంకటేశ్వర్లు, వెంకటేష్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .