కీసరలో డెకాయిటీ గ్యాంగ్ అరెస్ట్
_గ్రైండర్ యాప్ ద్వారా పరిచయం
– బ్లాక్‌మెయిల్ చేసి దోపిడీలు
కీసర, ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో డీసీపీ సి.హెచ్. శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించి డెకాయిటీ గ్యాంగ్ అరెస్టు వివరాలు వెల్లడించారు.నాలుగు రోజుల క్రితం బాధితులపై దాడి చేసి 15 గ్రాముల బంగారం, ఒక కార్, ఆరు సెల్‌ఫోన్లు, ఒక స్కూటీ దోచుకున్న గ్యాంగ్‌ను పోలీసులు వేగంగా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించారు.మొత్తం ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించగా, ఒకరు పరారీలో ఉన్నాడు.అరెస్టయిన వారు కుసుమ కార్తీక్, రామ్ రాజా, బబ్లు సింగ్, కందుల సాయి తేజ, గండ్ల శ్రావణ్, మాచర్ల పవన్ కళ్యాణ్ కాగా, చెన్నకేశవుల పవన్ కళ్యాణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా వరంగల్ ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు.నిందితులు గ్రైండర్ యాప్ ద్వారా పరిచయం ఏర్పరచుకుని గే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, వారి ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు, ఆస్తులు దోచుకుంటున్నట్లు విచారణలో బయటపడింది. అబ్దుల్లాపూర్‌మెట్, ఘట్‌కేసర్, కీసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు.సోషల్ మీడియా, ప్రైవేట్ యాప్‌ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని యువత అప్రమత్తంగా ఉండాలని డీసీపీ శ్రీధర్ సూచించారు. ఈ కేసును త్వరగా చేధించిన కీసర పోలీసులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎసిపిచక్రవర్తి, సీఐ ఆంజనేయులు పాల్గొన్నారు. 


Comments