కాప్రా శ్రీరాంనగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నిరసన దీక్ష

కాప్రా శ్రీరాంనగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నిరసన దీక్ష

_వాణిజ్య షాపుల వేలం రద్దు చేయాలి 

– స్థానికులకే కేటాయించాలని డిమాండ్

కాప్రా, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా ప్రాంతంలోని టూ బెడ్‌రూమ్ హౌసింగ్ కాలనీలో శ్రీరాంనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన దీక్ష నిర్వహించారు. కాలనీలో ఉన్న వాణిజ్య షాపులను బయట వ్యక్తులకు వేలం వేయకుండా, స్థానిక నివాసితులకే కేటాయించాలని, అలాగే కాలనీ అభివృద్ధికి ప్రభుత్వం కార్పస్ ఫండ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఎం పార్టీ నాయకులు శ్రీమన్నారాయణ, సీఐటీయూ జిల్లా నాయకుడు ఎన్. శ్రీనివాస్, సీపీఎం నాయకుడు ఎన్. బాబురావు హాజరయ్యారు. కాలనీ అధ్యక్షుడు రాము నాయక్, కార్యదర్శి గౌస్ పాషా, ఉపాధ్యక్షుడు రవీందర్, అలాగే కాలనీ వాసులు మున్న కరుణాకర్, శ్రీను, యాదగిరి, నగేష్, అబ్దుల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీలోని షాపులను స్థానికులకు మాత్రమే ఇవ్వాలని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.బాబురావు మాట్లాడుతూ షాపులను బయట వారికి కేటాయిస్తే కాలనీ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. ఇప్పటికే లిఫ్ట్ సమస్యలు, నీటి కొరత, వాచ్‌మన్ జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు.షాపులను కాలనీ వాసులకే కేటాయించి, వాటి ద్వారా వచ్చే అద్దెను మెయింటెనెన్స్ కోసం వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే వేలం ప్రక్రియను నిలిపివేయకపోతే ఈ నెల 15వ తేదీన ఆర్డీవో కార్యాలయం ముందు భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసనకు సంఘీభావం తెలిపిన సీపీఎం, సీఐటీయూ నాయకులకు శ్రీరాంనగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీ నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు.IMG-20260412-WA0120

Tags:

Post Your Comments

Comments

Latest News