మక్కజొన్న మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

మక్కజొన్న మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

వేలేరు, ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలో సర్పంచ్ బిల్లా యాదగిరిఅధ్యక్షతన పిఏసీఎస్ మరియు ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రస్తుతం మొక్కజొన్న రైతులు ఎకరానికి సుమారు ₹20 వేల వరకు నష్టపోతున్నారని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ₹2400 ఉన్నప్పటికీ వ్యాపారులు మాత్రం ₹1600–1700కే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యక్షంగా ధాన్యం కొనుగోలు చేస్తోందని, దీనివల్ల ప్రతి సీజన్‌కు ప్రభుత్వానికి భారీగా నష్టం వచ్చినప్పటికీ రైతు సంక్షేమమే ముఖ్యమని పేర్కొన్నారు. రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.
హన్మకొండ జిల్లాలో మొట్టమొదటి ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేలేరులో ప్రారంభించామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో ఎక్కువ కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని, దీనివల్ల వారికి ఉపాధి, ఆదాయం లభిస్తుందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతోందని అన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
జులై 2026 నాటికి మల్లన్న గండి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి వేలేరు మండల రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,సర్పంచులు అధికారులు, రైతులు పాల్గొన్నారు.IMG-20260411-WA0486

Tags:

Post Your Comments

Comments

Latest News