కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా?'..
హరీష్ రావు పై మంత్రి తుమ్మల గరం
Views: 7
On
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు )
స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆదివారం జన్మదిన వేడుకల్లో.. ఆత్మీయ సమ్మేళనమే నాకు తెలియదు కానీ, హరీష్ రావు మాట్లాడే తీరును చూస్తే ఆయన మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతుందని అన్నారు. పదేళ్ల పాలనలో మీరు ఆర్థిక విధ్వంసం సృష్టించి ఈరోజు మాకు నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల హరీష్ రావు పై ఫైర్ అయ్యారు.
మీ హయాంలో రైతు బంధు, సీఎం రిలీఫ్ ఫండ్ స్కాం లు జరగలేదా అంటూ ప్రశ్నించారు. భూ కబ్జాలు, ప్రజల పై కేసులు పెట్టించి నానా ఇబ్బందులకు గురిచేసింది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు. రుణమాఫీ మొదటి మూడు నెలల్లో రైతులు ఖాతాలో జమ చేసిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అన్నారు.
రూ. 25 వేల కోట్ల రూపాయలను రైతు ఖాతాలో జమ చేశామని, మీకు అనుమానం ఉంటే ఖాతా నెంబర్లు ఇస్తాము వెళ్లి చెక్ చేసుకోండి అన్నారు. పది సంవత్సరాల్లో మీరు సృష్టించిన విధ్వంసాన్ని సరి చేసుకుంటూ కష్టాల్లో ఉన్న కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీలో హరీష్ రావు స్థాయి ఏందో ముందు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments