తెలంగాణ ఉద్యమకారులకు కృతజ్ఞతలు.

తెలంగాణ ఉద్యమకారులకు కృతజ్ఞతలు.

–తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (రిజిస్టర్డ్) సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే.వీ. కృష్ణారావు

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు )

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (రిజిస్టర్డ్) సంఘం పిలుపుమేరకు ఖమ్మం జిల్లా నుండి వెళ్లి సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఉద్యమకారునికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలను తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే.వీ.కృష్ణారావు , ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ పసుపులేటి నాసరయ్య తెలిపారు .

 *కల్వకుంట్ల కవిత కు ప్రత్యేక కృతజ్ఞతలు* 

సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లిన తెలంగాణ ఉద్యమకారును హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేసి మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ లో ఉంచారని తెలుసుకొని పరామర్శించడనికి వచ్చిన శ్రీమతి కల్వకుంట్ల కవిత కు తెలంగాణ ఉద్యమకారుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే.వీ. కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు . లేని పక్షంలో ప్రజా ప్రతినిధులను అడుగు అడుగున నిలదీయావలసి వస్తుందని హెచ్చరించారు . ముందు ముందు ఇలాగే ఉద్యమకారులు సహకరించాలని కోరారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు బచ్చల పద్మాచారి , నెలవెల్లి వెంకటేశ్వరావు , భుక్య శ్రీనివాస్ నాయక్ , గొట్టిపర్తి శ్రీనివాస్ , మల్లెబోయిన వెంకయ్య , బొమ్మ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు .

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .