అంగన్వాడీల పనితీరుపై విమర్శలు… పర్యవేక్షణ లోపంపై ప్రశ్నలు

అంగన్వాడీల పనితీరుపై విమర్శలు… పర్యవేక్షణ లోపంపై ప్రశ్నలు

పెద్దమందడి,ఏప్రిల్16(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లోపం ఉందని అనకాయి పల్లి తండా గ్రామ సర్పంచ్ ఆంజనేయులు విమర్శించారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఈ అంశం ప్రాధాన్యత పొందింది.సమావేశంలో అంగన్వాడి కార్యకలాపాల ప్రగతిని సూపర్వైజర్ నాగరాణి వివరిస్తున్న సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు స్పందిస్తూ.. మండలంలోని అంగన్వాడి కేంద్రాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులకు, బాలింతలకు అందిస్తున్న గుడ్లు, పౌష్టికాహారం పక్కదారి పడుతున్నాయని, సమయపాలన కూడా పాటించడం లేదని, పై అధికారుల పర్యవేక్షణ కరువైందని విమర్శలు వ్యక్తమయ్యాయి.అంగన్వాడి సిబ్బంది జీతాలు తీసుకుంటూ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని కూడా సమావేశంలో విమర్శలు వినిపించాయి. ఈ విషయాన్ని ప్రశ్నించిన వారిపై వివిధ శాఖల పనిభారం పేరుతో ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో గ్రామంలో మూడు నుంచి ఐదు వందల మందికి సేవలు అందించాల్సిన పరిస్థితి ఉండటంతో సిబ్బందిపై పనిభారం అధికంగా ఉందని పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నప్పుడు విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.దీనికి స్పందించిన అంగన్వాడి సూపర్వైజర్ నాగరాణి, ఇలాంటి సమస్యలు తమ దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఇకనైనా సమర్థమైన పర్యవేక్షణతో అంగన్వాడి వ్యవస్థను బలోపేతం చేయాలని సమావేశంలో పలువురు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .