దళిత రత్న అవార్డు అందుకున్న జర్నలిస్ట్ ధనుష్

దళిత రత్న అవార్డు అందుకున్న జర్నలిస్ట్ ధనుష్

కొత్తకోట ఏప్రిల్16(తెలంగాణ ముచ్చట్లు):

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్ట్ ధనుష్ దళిత రత్న అవార్డును అందుకున్నారు.బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ, ప్రభుత్వ సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కో-చైర్మన్ సుదర్శన్ బాబు, మాజీ మంత్రి మొత్కంపల్లి నర్సింహులు, దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్ చేతుల మీదుగా ధనుష్‌కు ఈ అవార్డు అందజేశారు. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ, దళిత జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.అవార్డు స్వీకరించిన అనంతరం ధనుష్ మాట్లాడుతూ..ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మరింత కృషి చేస్తానన్నారు.ఈ అవార్డుకు సహకరించిన సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉత్సవాల కమిటీ సభ్యులు, దళిత జర్నలిస్టుల పోరం కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .