ప్రజా పాలనతో సంక్షేమం–అభివృద్ధికి ప్రాధాన్యం.

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

ప్రజా పాలనతో సంక్షేమం–అభివృద్ధికి ప్రాధాన్యం.

గోపాల్‌పేట్,ఏప్రిల్16(తెలంగాణ ముచ్చట్లు):

మున్సిపల్ పట్టణ, మండల స్థాయి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం గోపాల్‌పేట్ మండల కార్యాలయం, పెబ్బేర్ సహారా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తయ్యాయని, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.మేం పాలకులు కాదు… సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్రబిందువుగా నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు వార్డుల వారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. గ్రామ, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నామని చెప్పారు.ప్రభుత్వ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాపాలన పేరుతో మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా గోపాల్‌పేట్ మండలం పోల్కేపహాడ్ గ్రామ సర్పంచ్ బంగారయ్య గ్రామంలో మద్యపానం నిషేధం అమలు చేసినందుకు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి శాలువాలతో సన్మానించారు. రైతులు పంట మార్పిడి పద్ధతులను అనుసరించి లాభాలను పెంచుకోవాలని సూచించారు.గ్రామాల్లో మద్యపానాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.మహాలక్ష్మి, ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులందరికీ చేరేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలపడం లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 16(తెలంగాణ ముచ్చట్లు ) డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని ఇన్స్పెక్టర్ కరుణాకర్...
హుజురాబాద్‌లో ఏప్రిల్ 25న హిందూ స్వర్ణ శంకన సమ్మేళనం.
గ్రంథాలయ సభ్యత్వ మేళా… విద్యార్థుల్లో జ్ఞానవికాసానికి నాంది.
ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్‌లో మండల స్థాయి సమీక్ష సమావేశం
ఎన్నికల హామీలు అమలు చేయాలి… ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.
జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి రచ్చ… అధికారులపై కాంగ్రెస్ ఫైర్
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం